ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
AP Disabled Pension Verification 2025: ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల పెన్షన్ తనిఖీ 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ పెన్షన్ దారులకు 2025 జనవరి 20 నుండి పెన్షన్ తనిఖీ మరియు పునః పరిశీలన జరగనుంది. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను అధికారులకు జారీ చేసింది.
AP Disabled Pension Verification 2025 – ఏ ఏ పెన్షన్ దారులకు తనిఖీ చేయనున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కింది దివ్యాంగుల పెన్షన్ దారులకు పునః పరిశీలన మరియు తనిఖీ జరగనుంది:
- ఎముకల సమస్య / లోకోమోటార్ (Orthopedic Handicapped / Locomotor)
- దృష్టిలోపం (Visual Impairment)
- వినికిడి లోపం (Hearing Impairment)
- మానసిక మాంద్యం (Mental Retardation)
- మానసిక అనారోగ్యం (Mental Illness)
- ఒకటి కన్నా ఎక్కువ సమస్యలు (Multiple Illness)

AP Disabled Pension Verification 2025 – ఎవరికి తనిఖీ చేయనున్నారని ఎలా తెలుస్తుంది?
దివ్యాంగ పెన్షన్ దారుల వివరాలను గ్రామ/వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (WEA) మరియు వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ (WWDS) SS పెన్షన్ వెబ్‌సైట్ లాగిన్‌లో చెక్ చేస్తారు. తనిఖీ చేయవలసిన పింఛన్ దారుల వివరాలు నోటీసుల రూపంలో జనరేట్ అవుతాయి.
విన్నపం: ఈ కంటెంట్ మీకు ఉపయోగకరంగా ఉంటే, మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. రోజు ఇటువంటి అప్‌డేట్లు అందించబడతాయి.
నోటీసు పింఛన్ దారునికి ఎలా అందుతుంది?
- ఆధార్ ధృవీకరణ: సచివాలయ సిబ్బంది నోటీసు జనరేట్ చేసిన తర్వాత, పెన్షన్ దారుని ఇంటికి వెళ్లి బయోమెట్రిక్ లేదా ఫేస్ లేదా కంటి గుర్తింపుతో ఆధార్ ధృవీకరణ చేస్తారు.
- సిగ్నల్ లేని ప్రదేశాల్లో: పేపర్ ఫార్మాట్‌లో సంతకం తీసుకొని నోటీసు అందజేస్తారు.
నోటీసులో ఏముంటుంది?
నోటీసులో పింఛన్ దారుల సంబంధిత వివరాలు ఉంటాయి:
- పింఛన్ దారుని పేరు
- పింఛన్ ఐడీ
- తనిఖీ జరిగే ప్రదేశం
- తనిఖీ తేదీ
నోటీసు అందుకున్న పింఛన్ దారుడు ఏం చేయాలి?
- తప్పనిసరి హాజరు: నోటీసులో సూచించిన తేదీ, ఆసుపత్రి వద్ద హాజరు కావాలి.
- హాజరు కాకుంటే: పెన్షన్ తాత్కాలికంగా నిలుపుదల చేయబడుతుంది. తర్వాతి పునః తనిఖీ వరకు పెన్షన్ చెల్లింపులు నిలిపివేయబడతాయి.
పింఛన్ దారుడు ఏం తీసుకొని వెళ్ళాలి?
- ఒరిజినల్ SADAREM సర్టిఫికేట్
- ఆధార్ కార్డ్

పింఛన్ తనిఖీలో ఏమి చేస్తారు?
- డాక్టర్ల పరిశీలన: పింఛన్ దారుల SADAREM సర్టిఫికేట్‌ను ధృవీకరిస్తారు.
- రీ-అసెస్‌మెంట్: వికలాంగుల అర్హతను రీ అసెస్‌మెంట్ చేస్తారు.
- మొబైల్ యాప్‌లో నమోదు: వివరాలను నమోదు చేసి, పెన్షన్ సిఫార్సు చేస్తారు.
పింఛన్ రద్దు ఎప్పుడు అవుతుంది?
- అర్హులైన వారికి: ఎటువంటి సమస్య లేదు.
- భోగస్ సర్టిఫికేట్లు ఉన్నవారికి: పెన్షన్ రద్దు చేయబడుతుంది.
- హాజరుకాని పింఛన్ దారులకు: మొదటి సారి హాజరుకాకపోతే హోల్డ్‌లోకి వెళుతుంది. రెండవసారి కూడా హాజరుకాకపోతే పెన్షన్ పూర్తిగా రద్దు అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ తనిఖీ ప్రక్రియను మరింత పారదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించాలని సంకల్పించింది. ఈ తనిఖీ ద్వారా అసలైన లబ్ధిదారులను గుర్తించి, తగినంత సాయం అందించడమే లక్ష్యం.
Disclaimer: ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న సమాచారం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే. ఏవైనా మార్పులు లేదా నవీకరణల కోసం అధికారిక ప్రకటనలను పరిశీలించండి.
తరచు అడిగే ప్రశ్నలు (FAQ)
1. పెన్షన్ తనిఖీకి నోటీసు ఎప్పుడు వస్తుంది? నోటీసు ప్రక్రియ 2025 జనవరి 20 నుండి ప్రారంభమవుతుంది.
2. నోటీసు అందుకున్న తర్వాత ఏమి చేయాలి? నోటీసులో సూచించిన తేదీ, స్థలానికి హాజరు కావాలి.
3. హాజరుకాని పక్షంలో ఏం జరుగుతుంది? మొదటి సారి హాజరుకాకపోతే పెన్షన్ నిలిపివేయబడుతుంది. రెండవసారి కూడా హాజరుకాకపోతే రద్దు అవుతుంది.
4. అవసరమైన డాక్యుమెంట్లు ఏమి? SADAREM సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా తీసుకురావాలి.