ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ
AP Pensions Verification 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,18,900 పెన్షన్లను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తనిఖీ చేయనున్నారు. ఈ వెరిఫికేషన్‌లో ఫేక్ సర్టిఫికెట్లు కలిగిన వారిని, అర్హత లేకుండా పెన్షన్ పొందిన వారికి పెన్షన్ తొలగించనున్నారు.
పెన్షన్ వెరిఫికేషన్ ఎందుకు?
ఈ వెరిఫికేషన్ కారణంగా అసత్య ధృవపత్రాల ఆధారంగా పింఛన్లు పొందుతున్న లబ్దిదారులను తొలగించి, అర్హులైన వారికి మాత్రమే ఈ సేవలు అందించనున్నారు.
వెరిఫికేషన్‌లో భాగంగా మొత్తం మూడు విభాగాలకు చెందిన పెన్షన్లు పరిశీలిస్తారు:
- మెడికల్ పెన్షన్లు
- వికలాంగుల పెన్షన్లు
- మల్టిడిఫార్మిటీ లెప్రసీ కేసులు
పెన్షన్ వెరిఫికేషన్ వివరణ
1. మెడికల్ పెన్షన్లు:
చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితమయ్యే పక్షవాతం, తీవ్రమైన కండరాల బలహీనత, మరియు ప్రమాద బాధితులు ఈ విభాగంలో వస్తారు.
2. వికలాంగుల పెన్షన్లు:
- లోకోమోటర్/ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్
- దృష్టి లోపం
- వినికిడి లోపం
- మానసిక అనారోగ్యం
- మల్టిపుల్ డిసేబిలిటీ
3. మల్టిడిఫార్మిటీ లెప్రసీ:
వీరు ప్రత్యేకంగా చేర్చబడతారు మరియు ప్రత్యేక వెరిఫికేషన్‌కు గురవుతారు.
తనిఖీ చేసే ప్రదేశాలు
వెరిఫికేషన్ ప్రక్రియ హాస్పిటల్స్ లేదా ఇంటి వద్ద నిర్వహించబడుతుంది:
- ఇంటింటి వెరిఫికేషన్ (మెడికల్ టీంలు ఇంటికి వెళ్లి తనిఖీ చేస్తారు).
- ఆసుపత్రి స్థాయి వెరిఫికేషన్:
- కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్
- ఏరియా హాస్పిటల్స్
- డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్
- మెడికల్ కాలేజీలు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ పెన్షన్ లెక్కలు
వర్గం | పెన్షన్ల సంఖ్య |
---|---|
పక్షవాతం (చక్రాల కుర్చీ) | 16,479 |
తీవ్రమైన కండరాల బలహీనత | 7,612 |
లోకోమోటర్/ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్ | 4,63,425 |
దృష్టి లోపం | 90,302 |
వినికిడి లోపం | 1,09,232 |
మానసిక అనారోగ్యం | 19,193 |
మల్టిడిఫార్మిటీ లెప్రసీ | 6,833 |
మొత్తం | 8,18,900 |
జిల్లా స్థాయి కమిటీ సభ్యులు
డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీ (DLCC) లో సభ్యులుగా వీరు ఉంటారు:
- జిల్లా కలెక్టర్
- DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్
- జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి
- గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్
- హాస్పిటల్ కోఆర్డినేటర్
- లెప్రసీ ఆఫీసర్
తనిఖీ ప్రక్రియ (Step-by-Step Process) – AP Pensions Verification 2025
- షెడ్యూల్ ప్రిపరేషన్:
మండల మరియు మున్సిపాలిటీ స్థాయిలో షెడ్యూల్ తయారు చేసి, గ్రామ వార్డు సచివాలయాలకు సమాచారం అందిస్తారు. - మెడికల్ టీంల ఆదేశాలు:
మెడికల్ టీంలను ప్రత్యేకంగా నియమించి, వారికి డిజిటల్ అసిస్టెంట్ల సహాయంతో యాప్ యాక్సెస్ కల్పిస్తారు. - పెన్షన్ దారులను కలవడం:
మెడికల్ టీం ఇంటికి వెళ్లి, వెరిఫికేషన్ ఫారాలను ఫిల్ చేసి సంతకం చేస్తారు. - డిజిటల్ అప్లోడింగ్:
డిజిటల్ అసిస్టెంట్ యాప్ ద్వారా ఫారాలను స్కాన్ చేసి, ఆధార్ ధృవీకరణను పూర్తి చేస్తారు. - చివరి నిర్ణయం:
వెరిఫికేషన్ ఫలితాల ఆధారంగా అర్హత ప్రమాణాల మేరకు పెన్షన్ కొనసాగింపు లేదా రద్దు నిర్ణయిస్తారు.
పెన్షన్ వెరిఫికేషన్ కోసం అడిగే ముఖ్య ప్రశ్నలు
- మీకు పక్షవాతం ఉందా?
- అవును/కాదు
- మీరు మంచానికి పరిమితమా?
- అవును/కాదు
- మీకు వీల్ చైర్ అవసరమా?
- అవును/కాదు
- వికలాంగ శాతం 85% కంటే తక్కువా?
- అవును/కాదు
- మీ పెన్షన్ కొనసాగింపుకు మెడికల్ టీం సిఫారసు చేస్తుందా?
- అవును/కాదు
సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం – AP Pensions Verification 2025
ఈ వెరిఫికేషన్ ద్వారా దుర్వినియోగం తగ్గించబడుతుంది. న్యాయంగా అర్హులైన వారు మాత్రమే ప్రభుత్వ పథకాలు పొందేందుకు అవకాశం కల్పించబడుతుంది.
Disclaimer: ఈ సమాచారం ప్రభుత్వ నోటిఫికేషన్ ఆధారంగా అందించబడింది. పూర్తి వివరాలకు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ వైద్యసేవ, ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం కీలక నిర్ణయం
సంక్రాంతి నుంచే ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం అర్హతలు, ప్రయోజనాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు?
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం రోజున తీపికబురు | కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు