ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
AP P4 Survey 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “స్వర్ణాంధ్ర విజన్ 2047” లో భాగంగా AP P4 Survey 2025 ను అమలు చేస్తోంది. ఈ సర్వే ముఖ్యంగా రాష్ట్రంలోని 20% పేద కుటుంబాలను గుర్తించి, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి అవసరమైన సహాయం అందించేందుకు రూపొందించబడింది. ఈ సర్వే ద్వారా ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను అభివృద్ధి చేయడం, పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా ఉంది.
AP P4 Survey 2025 ముఖ్యమైన తేదీలు
సర్వే దశ | తేదీ |
---|---|
2వ విడత ప్రారంభం | మార్చి 8, 2025 |
2వ విడత ముగింపు | మార్చి 18, 2025 |
సమాచార జాబితా ప్రదర్శన | మార్చి 21, 2025 (గ్రామ సభలో) |
సర్వే నిర్వహణ: గ్రామ/వార్డ్ సచివాలయ సిబ్బంది
లక్ష్య గ్రూప్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు
AP P4 Survey 2025 జిల్లాలు
1వ విడత సర్వే పూర్తయిన జిల్లాలు:
- అనంతపురం
- అన్నమయ్య
- చిత్తూరు
- కర్నూలు
- నంద్యాల
- ప్రకాశం
- నెల్లూరు
- సత్యసాయి
- తిరుపతి
- వైఎస్ఆర్ కడప
2వ విడత సర్వే (మార్చి 8 నుండి ప్రారంభం) మిగిలిన జిల్లాల్లో జరుగుతుంది.

సర్వే ప్రక్రియ
సర్వేలో అడిగే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు
AP P4 Survey 2025 ప్రక్రియ
- GSWS Employees Latest Version App డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- User ID & Biometric / Face / Irish స్కాన్ ద్వారా లాగిన్ అవ్వాలి.
- P4 Survey ఆప్షన్ సెలెక్ట్ చేసి, క్లస్టర్ ఎంపిక చేయాలి.
- కుటుంబ వివరాలు నమోదు చేయాలి (27 ప్రశ్నలు).
- సర్వే పూర్తయిన తర్వాత సచివాలయ ఉద్యోగి తన బయోమెట్రిక్ లేదా OTP ద్వారా ధృవీకరించాలి.
AP P4 Survey 2025 లో అడిగే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు
- ఇంట్లో అందుబాటులో ఉన్నారా?
- Yes / No (వలస/మరణం వివరాలు)
- ఆధార్ నెంబర్ నమోదు చేయాలి.
- మీకు సర్వేలో భాగమయ్యేందుకు సమ్మతి ఉందా?
- పెద్ద ఫోన్ ఉందా? (OTP వెరిఫికేషన్ అవసరం)
- ఇంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారు?
- ఎంత మంది సంపాదిస్తున్న వారు ఉన్నారు?
- ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా?
- గత 2 సంవత్సరాల్లో ఆదాయపు పన్ను చెల్లించారా?
- ఇల్లు రకాన్ని (కచ్చా / పక్కా) ఎంచుకోవాలి.
- ఇంట్లో బ్యాంకు ఖాతా ఉందా?
- పట్టణ/మునిసిపల్ పరిధిలో ఆస్తుల వివరాలు.
- వాణిజ్యేతర (Non-commercial) 4-వీలర్ వాహనం ఉందా?
- విద్యుత్ కనెక్షన్ వివరాలు, నెలసరి బిల్లు.
- తాగునీటి వనరు (కొళాయి / బోరు / ట్యాంకర్ / బాటిల్ వాటర్).
- ఇంట్లో ఎలాంటి ఆస్తులు ఉన్నాయి? (ల్యాప్‌టాప్, టీవీ, ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మిషన్, ఇతర సామగ్రి)
- వంట ఇంధనం ఏది? (ఎల్పీజీ, బొగ్గు, కలప మొదలైనవి)
AP P4 Survey 2025 FAQ’s
- ఈ సర్వే ప్రభుత్వ పథకాలపై ప్రభావం చూపుతుందా?
- లేదు, ఈ సర్వే ఎటువంటి ప్రభుత్వ పథకాలను ప్రభావితం చేయదు.
- సర్వే సమయంలో కుటుంబ సభ్యులు అందుబాటులో లేకుంటే ఏమి చేయాలి?
- తిరిగి వెళ్లి సర్వే చేయాలి.
- కుటుంబం వలస వెళ్లినట్లయితే ఏమి చేయాలి?
- కొత్త సచివాలయ వివరాలు నమోదు చేయాలి లేదా “వలస” ఎంపిక చేయాలి.
- కుటుంబం సర్వేలో పాల్గొనడానికి నిరాకరిస్తే?
- “Denied Consent” ఎంపికను సెలెక్ట్ చేసి, సర్వేయర్ తన బయోమెట్రిక్ ద్వారా ధృవీకరించాలి.
- సంపాదన కలిగిన వ్యక్తిగా ఎవరిని పరిగణించాలి?
- వ్యవసాయదారులు, కూలీలు, పెన్షనర్లు, అద్దె ఆదాయం పొందేవారు.
- కచ్చా ఇల్లు అంటే ఏమిటి?
- మట్టి గోడలు, కలప టవర్స్ కలిగి ఉంటే కచ్చా ఇల్లు, సిమెంట్ గోడలు ఉంటే పక్కా ఇల్లు.
- Non-commercial వాహనాలు అంటే?
- Yellow plate ఉన్న వాహనాలు వాణిజ్య వాహనాలు, వ్యక్తిగత ఉపయోగంలో ఉన్నవి వాణిజ్యేతర వాహనాలు.
- రౌండ్ ట్రిప్ అంటే ఏమిటి?
- నీటి మూలానికి వెళ్లి తిరిగి ఇంటికి రావడానికి పట్టే మొత్తం సమయం.
- సర్వేయర్ సమాధానాలను తనంతట తాను ధృవీకరించాలా?
- సాధ్యమైనంత వరకు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి.
AP P4 Survey 2025 ఉపయోగాలు
✅ పేదరిక నిర్మూలన
✅ ఆర్థిక సహాయం & ఉపాధి అవకాశాలు
✅ సరికొత్త ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ప్రాజెక్టుల అమలు
✅ ప్రతి కుటుంబంలో పారిశ్రామికవేత్త అభివృద్ధి
📢 ప్రజలకు సూచన:
ఈ సర్వేలో పాల్గొని మీ కుటుంబ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే అవకాశాన్ని ఉపయోగించుకోండి!
రేషన్ కార్డుదారులు గమనిక! మార్చి 31 లోపు ఈ పని చేయకపోతే రేషన్ కార్డు రద్దు!
AP లోని మహిళలకు ఈరోజు నుండే ఉచిత కుట్టు మిషన్ల పంపిణి పథకం ప్రారంభం – పూర్తి వివరాలు!
ఏపీ కౌలు రైతులకు రూ.7 లక్షల ఆర్థిక సహాయం – మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన
మహిళా దినోత్సవం రోజున అంగన్‌వాడీలకు భారీ శుభవార్త చెప్పనున్న చంద్రబాబు
ఏపీలోని మహిళలకు సువర్ణావకాశం…డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు ఉంటె చాలు
Tags: AP P4 సర్వే 2025, AP P4 మోడల్ సర్వే, P4 సర్వే ప్రక్రియ, ఆంధ్రప్రదేశ్ పేదరిక సర్వే, AP P4 సర్వే నివేదికలు, AP P4 సర్వే FAQs, P4 సర్వే యాప్