ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు రాష్ట్రానికి సంబందించిన తాజా సమాచారం అందరికంటే ముందుగా మీ మొబైల్ కి రావడానికి ఇప్పుడే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపు లలో జాయిన్ అవ్వండిి
Last Updated on 14/04/2025 by Krithik Varma
AP Out Sourcing Jobs In Medical College: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు చక్కని అవకాశం వచ్చింది. పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మరియు ప్రభుత్వ హాస్పిటల్ లో 244 ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు 10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ వంటి విద్యార్హతలతో పాటు వివిధ పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు.
AP Out Sourcing Jobs In Medical College _ భర్తీ చేసే సంస్థ వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, పాడేరు ప్రభుత్వ హాస్పిటల్ లో ఖాళీలను భర్తీ చేస్తారు.
- పోస్టుల సంఖ్య: 244
- మెడికల్ కాలేజీలో: 64 పోస్టులు
 - ప్రభుత్వ హాస్పిటల్ లో: 180 పోస్టులు
 
 
 అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
AP Out Sourcing Jobs In Medical College – పోస్టుల వివరణ
మొత్తం 29 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు:
- రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్
 - స్టోర్ కీపర్
 - అనస్తీసియా టెక్నీషియన్
 - ఆడియో విజువల్ టెక్నీషియన్
 - ఆడియో మెట్రి టెక్నీషియన్
 - కార్డియాలజీ టెక్నీషియన్
 - చైల్డ్ సైకాలజిస్ట్
 - క్లినికల్ సైకాలజిస్ట్
 - ఈసీజీ టెక్నీషియన్
 - జనరల్ డ్యూటీ అటెండెంట్
 - ల్యాబ్ టెక్నీషియన్
 - ఫిజియోథెరపిస్ట్
…ఇత్యాది. 
 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం డేట్ ఫిక్స్ చేసిన చంద్రబాబు
విద్యార్హతలు
- పదవ తరగతి, ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
 - కొంతమంది పోస్టులకు పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
 
జీతం
- కనిష్టంగా ₹15,000 నుండి గరిష్టంగా ₹54,060 వరకు జీతాలు అందిస్తారు.
 
![]()
ఎంపిక విధానం
- రాత పరీక్ష లేదు.
 - మెరిట్ ఆధారంగా ఎంపిక:
- అర్హత పరీక్షలో మార్కులకు 75% వెయిటేజ్.
 - అనుభవానికి 15% మార్కులు.
 - సంబంధిత కోర్సు పూర్తయిన సంవత్సరాల ఆధారంగా గరిష్టంగా 10% మార్కులు.
 
 
అనుభవానికి మార్కుల కేటాయింపు
- గిరిజన ప్రాంతాల్లో పని చేస్తే: ప్రతి ఆరు నెలలకు 2.5 మార్కులు.
 - గ్రామీణ ప్రాంతాల్లో: ప్రతి ఆరు నెలలకు 2 మార్కులు.
 - పట్టణ ప్రాంతాల్లో: ప్రతి ఆరు నెలలకు 1 మార్కు.
 
 ఏపీ అన్నదాత సుఖీభవ పథకం 2024 | అర్హతలు, ప్రయోజనాలు, ఎలా అప్లై చెయ్యాలి పూర్తి సమాచారం
ముఖ్యమైన తేదీలు
| ఈవెంట్ | తేదీ | 
|---|---|
| నోటిఫికేషన్ విడుదల తేదీ | 30-12-2024 | 
| అప్లికేషన్ ప్రారంభ తేదీ | 31-12-2024 | 
| అప్లికేషన్ చివరి తేదీ | 10-01-2025 | 
| ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ | 01-02-2025 | 
| ఫైనల్ మెరిట్ లిస్ట్ | 08-02-2025 | 
| ఫైనల్ సెలక్షన్ లిస్ట్ | 17-02-2025 | 
| కౌన్సిలింగ్ తేదీ | 20-02-2025 | 
వయో పరిమితి
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
 - గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
 - సడలింపు:
- ఎస్సీ, ఎస్టీ, బీసీ: 5 సంవత్సరాలు
 - దివ్యాంగులు: 10 సంవత్సరాలు
 
 
దరఖాస్తు ప్రక్రియ
- అభ్యర్థులు నోటిఫికేషన్ లో పేర్కొన్న అప్లికేషన్ ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
 - పూర్తి చేసిన అప్లికేషన్, అవసరమైన డాక్యుమెంట్లు, అప్లికేషన్ ఫీజు డిడిని జతపరచి కింద ఇచ్చిన చిరునామాకు పంపాలి:
ప్రిన్సిపల్, పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, అల్లూరి సీతారామరాజు జిల్లా. 
నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్
అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా అప్లై చేసి ఉద్యోగ అవకాశాన్ని పొందండి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు రాష్ట్రానికి సంబందించిన తాజా సమాచారం అందరికంటే ముందుగా మీ మొబైల్ కి రావడానికి ఇప్పుడే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపు లలో జాయిన్ అవ్వండిి










