Missed EMI మిస్‌ అయ్యారా? – మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం, పరిష్కార మార్గాలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు రాష్ట్రానికి సంబందించిన తాజా సమాచారం అందరికంటే ముందుగా మీ మొబైల్ కి రావడానికి ఇప్పుడే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపు లలో జాయిన్ అవ్వండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Last Updated on 17/04/2025 by Krithik Varma

Missed EMI: ఈరోజుల్లో చాలామంది రుణాలు తీసుకుని EMIs ద్వారా చెల్లింపులు చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో కొందరు తమ EMIని మిస్‌ చేస్తుంటారు. అయితే ఒక్కసారి కూడా ఈఎంఐ ఆలస్యం అయితే, లేదా మిస్‌ అయితే క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. ఇది భవిష్యత్తులో రుణాలు పొందడాన్ని మరింత కష్టతరం చేయొచ్చు. మరి, ఆలస్య చెల్లింపుల కారణంగా ఏం జరుగుతుందో, మరియు ఈ పరిణామాల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం.

Missed EMI Impact Credit Score Full Details In Telugu1 Lakh Loan: ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త – రూ.1 లక్ష రుణం పొందండి!

Missed EMI మిస్‌ అయితే జరగే పరిణామాలు

  • క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది: ఒక్కసారి కూడా EMI మిస్‌ అయితే క్రెడిట్ బ్యూరోలు దీన్ని రికార్డ్ చేస్తాయి. ఫలితంగా మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది.
  • ఆలస్య రుసుములు: కొన్ని బ్యాంకులు EMI ఆలస్యం చేస్తే భారీగా లేట్ పేమెంట్ ఛార్జీలను విధిస్తాయి.
  • వడ్డీ పెరుగుతుంది: రుణ చెల్లింపులో ఆలస్యం అయితే అదనపు వడ్డీ చెల్లించాల్సిన అవసరం వస్తుంది.
  • భవిష్యత్తులో రుణాలు పొందడం కష్టం: క్రెడిట్ స్కోర్ పడిపోయినట్లయితే కొత్త రుణాలు లేదా క్రెడిట్ కార్డులు పొందడం చాలా కష్టతరమవుతుంది.

Missed EMI Impact Credit Score Full Details In TeluguAP P4 Survey 2025 అంటే ఏమిటి? ఎందుకు చేస్తున్నారు? ఎవరికి ఉపయోగం?

బ్యాంకుల ఆలస్య రుసుములు ఎంత?

1. HDFC బ్యాంక్: ₹100 – ₹1,300 వరకు ఆలస్య చెల్లింపు ఛార్జీలు విధిస్తుంది.
2. ICICI బ్యాంక్: ₹100 – ₹1,000 వరకు ఆలస్య రుసుములు వసూలు చేస్తుంది.
3. Kotak Mahindra బ్యాంక్: బకాయి మొత్తం మీద 8% ఆలస్య రుసుము విధిస్తుంది.

EMI ఆలస్య చెల్లింపుని నివారించడానికి మార్గాలు

  1. ఆటో డెబిట్ సదుపాయం: మీ బ్యాంక్ అకౌంట్లో EMI చెల్లింపులు ఆటోమేటిక్‌గా డెబిట్ అయ్యేలా సెటప్ చేసుకోవడం మంచిది.
  2. సమయానికి రిమైండర్లు పెట్టుకోవాలి: మీ మొబైల్‌లో లేదా బ్యాంక్ యాప్‌లో EMI డేట్ రిమైండర్ ఆప్షన్‌ను ఉపయోగించండి.
  3. అడ్వాన్స్‌ గా చెల్లింపు: ఏదైనా అకస్మాత్‌ పరిస్థితుల వల్ల డబ్బులు లేనప్పుడు EMI పేమెంట్ ముందుగా చేసి ఉంచడం మంచిది.
  4. బ్యాంకును సంప్రదించండి: మీకు EMI మిస్‌ అయ్యే పరిస్థితి ఉంటే ముందుగానే బ్యాంకును సంప్రదించి, ఆలస్యం జరగకుండా మాఫీ లేదా మరిన్ని మార్గాలు సూచించగలరు.

Missed EMI Impact Credit Score Full Details In Telugu
టెక్ మహీంద్రా రిక్రూట్మెంట్ 2025 – కొత్త ఉద్యోగావకాశాలు ఫ్రెషర్స్‌కు | వెంటనే అప్లై చేయండి!

తేదీ మిస్‌ అయితే ఏం చేయాలి?

  • మీ బ్యాంక్‌ లేదా ఫైనాన్సియల్ సంస్థ కస్టమర్ కేర్‌ను సంప్రదించండి.
  • ఆలస్య రుసుముల తగ్గింపు కోసం బ్యాంక్‌తో నేరుగా మాట్లాడండి.
  • తక్షణమే బకాయీ EMIని చెల్లించడానికి వీలుగా ఇతర ఆప్షన్లను పరిశీలించండి.

Missed EMI Impact Credit Score Full Details In Teluguపేదలకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గృహ నిర్మాణానికి అదనపు సాయం ప్రకటించింది

EMI చెల్లింపు ఆలస్యం కాకుండా ఉండేలా ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలి. ఆటో డెబిట్, రిమైండర్లు, బ్యాంక్‌లతో సంప్రదింపులు వంటి స్టెప్స్ ద్వారా మీరు క్రెడిట్ స్కోర్‌ను రక్షించుకోవచ్చు. EMI మిస్‌ అయితే వెంటనే బ్యాంకును సంప్రదించి పరిష్కారం కనుగొనడం చాలా అవసరం.

Tags: Missed EMI Impact, Credit Score Effect, Late Payment Charges, EMI Penalty, Loan Repayment Issues

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు రాష్ట్రానికి సంబందించిన తాజా సమాచారం అందరికంటే ముందుగా మీ మొబైల్ కి రావడానికి ఇప్పుడే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపు లలో జాయిన్ అవ్వండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Comment

WhatsApp Join WhatsApp