Household Mapping – సంక్షేమ పథకాలు, పౌర సేవలు పొందాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి | పూర్తి వివరాలు

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Household Mapping: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి చేసింది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఏ ప్రభుత్వ సేవ లేదా పథకాన్ని పొందాలన్నా, తప్పనిసరిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాబేస్‌లో పేరు నమోదు కావాల్సిందే. RTGS / GSWS House Hold Data Base ద్వారా లబ్ధిదారుల వివరాలు వాలిడేషన్ చేయనున్నారు. ఈ డేటాలో పేరు లేకుంటే ఇకపై ఏ ప్రభుత్వ పథకాన్ని కూడా పొందలేరు.

ప్రభుత్వం ఇచ్చిన తాజా ఉత్తర్వుల ప్రకారం, అన్ని డిపార్ట్మెంట్లు తమ పరిధిలో ఉన్న పౌరుల వివరాలను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాబేస్‌లో నమోదు చేయాలి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం – 2023 ప్రకారం, ఈ డేటా పూర్తి గోప్యంగా ఉంచబడుతుంది.

AP Household Mapping 2025 లో పేరు ఉందా లేదా? చెక్ చేసుకునే విధానం

ప్రజలకు నేరుగా చెక్ చేసుకునే ఆప్షన్ లేకపోయినా కింది విధానాల్లో తన వివరాలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు:

  1. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న సర్వేలో మీ పేరు ఉంటే, హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో మీ రికార్డు ఉందని అర్థం.
  2. WhatsApp Governance ద్వారా ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే, మీ సచివాలయం పేరు, కోడ్ మరియు ఇతర వివరాలు కనబడితే, హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో మీ పేరు ఉంది.
  3. ఇసుక బుకింగ్, ఇతర ప్రభుత్వ సేవలు ఉపయోగిస్తున్నప్పుడు ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే, మీ సచివాలయం పేరు కనిపిస్తే, హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో మీరు నమోదయ్యారని అర్థం.
  4. గ్రామ/వార్డు సచివాలయంలో ఆధార్ నంబర్ ఇచ్చి చెక్ చేయించుకోవచ్చు.

AP Household Mapping లో పేరు నమోదు చేసే విధానం

మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో పేరు నమోదు చేయాలని అనుకుంటే, మీ గ్రామ/వార్డు సచివాలయాన్ని సందర్శించాలి. క్రింద ఇచ్చిన ప్రాసెస్ ద్వారా కొత్తగా పేరు నమోదు చేసుకోవచ్చు.

Step-by-Step Process

  1. NBM పోర్టల్ లాగిన్ అవ్వాలి.
  2. Scheme Eligibility Check సెక్షన్‌లోకి వెళ్లాలి.
  3. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఎలిజిబిలిటీ చెక్ చేయాలి.
  4. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా లో పేరు లేనట్లయితే, కొత్తగా జోడించడానికి (Adding) ఆప్షన్ ఉంటుంది.
  5. గ్రామ/వార్డు సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ ద్వారా పేరు నమోదు చేయించుకోవచ్చు.

కుటుంబ సభ్యులను ఎలా జోడించాలి?

మీ కుటుంబంలో కొత్తగా చేరిన వారు, పెళ్లయిన కోడలు, కొత్తగా వచ్చిన సభ్యులు లాంటి వారి పేర్లను కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో జోడించవచ్చు.

సొంతంగా Adding Process

  1. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లింక్ ఓపెన్ చేయండి
  2. Aadhaar Authentication టిక్ చేసి, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి OTP ద్వారా లాగిన్ అవ్వాలి.
  3. వ్యక్తిగత వివరాలు (పేరు, పుట్టిన తేదీ, చిరునామా, విద్య, వృత్తి, కులం) నమోదు చేయాలి.
  4. కుటుంబ సభ్యులను జోడించాలా? అనే ప్రశ్న వద్ద YES అని సెలెక్ట్ చేయాలి.
  5. ఇప్పటికే నమోదైన కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్ ఎంటర్ చేసి SEARCH బటన్ క్లిక్ చేయాలి.
  6. మ్యాపింగ్ ఐడీ కనుక్కొని, తమ పేరును కుటుంబంలో జోడించాలి.

Household Mapping ఎక్కడ చేసుకోవాలి?

మీ శాశ్వత చిరునామా, ఆధార్ చిరునామా, రేషన్ కార్డు చిరునామా ఉన్న గ్రామ/వార్డు సచివాలయంలోనే మ్యాపింగ్ చేయించుకోవాలి. గ్రామ వార్డు వాలంటీర్లు, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ అధికారులు ఈ ప్రక్రియ నిర్వహిస్తారు.

AP Household Mapping 2025 – ముఖ్యమైన సమాచారం

  • AP ప్రభుత్వ సేవలు, పథకాలు పొందాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి.
  • ప్రభుత్వ డేటాబేస్‌లో పేరు లేకుంటే ప్రభుత్వ పథకాలు, లబ్ధులు పొందలేరు.
  • గ్రామ/వార్డు సచివాలయాల్లోనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నమోదు చేసుకోవచ్చు.
  • పిల్లలు, కొత్తగా పెళ్లైన కోడలు, వితంతువులు, ఒంటరి వ్యక్తులు, ట్రాన్స్ జెండర్లు కూడా కొత్తగా పేరు జోడించుకోవచ్చు.
  • మీ ఆధార్ నంబర్ ఉపయోగించి WhatsApp Governance ద్వారా పేరు చెక్ చేసుకోవచ్చు.

AP P4 Survey 2025 – సంబంధిత లింకులు

AP P4 Survey 2025 – పూర్తి సమాచారం
AP Household Mapping GO Download

ముఖ్య గమనిక: AP హౌస్ హోల్డ్ మ్యాపింగ్ 2025 ప్రక్రియలో భాగంగా RTGS / GSWS శాఖలు అన్ని పౌరుల వివరాలను క్రమంగా వాలిడేట్ చేయనున్నాయి. మీరు ఇంకా హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో నమోదు కాలేకపోతే వెంటనే మీ గ్రామ/వార్డు సచివాలయంలో సంప్రదించి పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి.

మీ పేరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉందా లేదా? వెంటనే చెక్ చేసుకోండి!

Tags: హౌస్ హోల్డ్ మ్యాపింగ్, AP ప్రభుత్వ డేటాబేస్, హౌస్ హోల్డ్ డేటా, AP P4 సర్వే, AP RTGS డేటా

AO Household Mapping 2025 Process Telugu

రేషన్ కార్డుదారులు గమనిక! మార్చి 31 లోపు ఈ పని చేయకపోతే రేషన్ కార్డు రద్దు!

AO House hold Mapping 2025 Process TeluguAP లోని మహిళలకు ఈరోజు నుండే ఉచిత కుట్టు మిషన్ల పంపిణి పథకం ప్రారంభం – పూర్తి వివరాలు!

AO House Hold Mapping 2025 Process Teluguఏపీ కౌలు రైతులకు రూ.7 లక్షల ఆర్థిక సహాయం – మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

AO House Hold Mapping 2025 Process Teluguమహిళా దినోత్సవం రోజున అంగన్‌వాడీలకు భారీ శుభవార్త చెప్పనున్న చంద్రబాబు

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Comment

WhatsApp