ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
Women Riders: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ప్రయాణ భద్రత, ఉపాధి అవకాశాల పెంపును దృష్టిలో ఉంచుకుని కొత్త రైడ్ సేవలను ప్రారంభించనుంది. ప్రస్తుతం ర్యాపిడో, ఓలా, ఉబర్ వంటి సంస్థలు రైడ్ సేవలు అందిస్తున్నా, వాటిలో ఎక్కువ మంది పురుష రైడర్లు ఉండటం వల్ల మహిళలకు భద్రతాపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మహిళా రైడ్ సేవలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.
డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే, వారికి ఈ-బైక్‌లు, ఈ-ఆటోలు
రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో మహిళా రైడర్లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధమైంది. స్వయం సహాయ సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే, వారికి ఈ-బైక్‌లు, ఈ-ఆటోలను అందజేసి ర్యాపిడో వంటి సంస్థలతో అనుసంధానం చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభ దశలో విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో అమలు చేయనున్నారు. ఒక్కో నగరానికి 400 వాహనాలు కేటాయించగా, మరో 200 వాహనాలను కాకినాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Women Riders | ముద్ర యోజన, స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా రుణాల సహాయం
ఈ వాహనాలను ముద్ర యోజన, స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా రుణాల సహాయంతో మహిళలకు కేటాయించనున్నారు. అంతేకాదు, మొదటి మూడు నెలల పాటు ర్యాపిడో సంస్థ ప్లాట్‌ఫాం ఛార్జీలను రద్దు చేయనుంది. ఆ తర్వాత నెలకు ₹1,000 చొప్పున ఛార్జీలు వర్తించనున్నాయి. అదనంగా, ప్రతి మహిళా రైడర్‌కు నెలకు కనీసం 300 బుకింగ్‌లు ర్యాపిడో సంస్థ ద్వారా ఇవ్వనుంది.
ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా మహిళలకు భద్రతతో కూడిన ప్రయాణ అవకాశం లభించడంతో పాటు, వారి ఆర్థిక స్థితిలో పురోగతి నమోదవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.
LPG: ఫోన్‌పే వాడే వారికి గొప్ప శుభవార్త.. ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇలా పొందొచ్చు!
ఏపీలోని మహిళలకు మహిళా దినోత్సవ కానుక – ఉచితంగా కుట్టు మిషన్లు, దరఖాస్తు చేసుకోండి!
ఏపీలో వాహనదారులకు భారీ షాక్.. మార్చి 1 నుండి కొత్త రూల్స్ అమలు.. తేడా వస్తే జైలే!
మహిళలకు 35% సబ్సిడీతో స్వయం ఉపాధి రుణాలు | ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
Tags: ఆంధ్రప్రదేశ్ మహిళా రైడర్లు, ర్యాపిడో మహిళా డ్రైవర్లు, ఈ-బైక్ ఈ-ఆటో సర్వీస్, మహిళల కోసం ప్రత్యేక రైడ్, AP మహిళా ఉపాధి ప్రాజెక్ట్