ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
ఏపి బడ్జెట్ కేటాయింపులు | AP Budget 2025-26
AP Budget 2025-26: మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ను రూపొందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇందులో వ్యవసాయానికి రూ.48,340 కోట్లు, వయబులిటీ గ్యాఫ్ ఫండ్ రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే ఎస్సీల గృహ నిర్మాణానికి రూ.50 వేలు, ఎస్టీల గృహ నిర్మాణానికి రూ.70 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు ఎన్టీఆర్ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..
▪️పాఠశాల విద్యకు రూ.31,806 కోట్లు
▪️వైద్యారోగ్య శాఖకు రూ.19,260 కోట్లు
▪️పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.18,848 కోట్లు
▪️జలవనరుల అభివృద్ధికి రూ.18,020 కోట్లు
▪️మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధికి రూ.13,862 కోట్లు
▪️విద్యుత్ శాఖకు రూ.13,600 కోట్లు
▪️వ్యవసాయానికి రూ.11,636 కోట్లు
▪️సాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లు
▪️ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రూ.10,619 కోట్లు
▪️రవాణా శాఖకు రూ.8,785 కోట్లు
▪️ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్పులకు రూ.3,377 కోట్లు
▪️పురపాలక శాఖకు రూ.13,862 కోట్లు,
▪️స్వచ్ఛ ఆంధ్ర కోసం రూ.820 కోట్లు
▪️ఐటీ, ఎలక్ట్రానిక్స్ రాయితీలు రూ.300 కోట్లు
▪️ఆదరణ పథకం కోసం రూ.1000 కోట్లు
▪️మనబడి పథకం కోసం రూ.3,486 కోట్లు
▪️తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు
▪️అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు
▪️దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు
▪️రోడ్ల నిర్మాణం, మరమ్మతులు రూ.4,220 కోట్లు
▪️బాల సంజీవని పథకం కోసం రూ.1,163 కోట్లు
▪️పోర్టులు, ఎయిర్‌పోర్టుల కోసం రూ.605 కోట్లు
▪️చేనేత, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్‌కు రూ.450 కోట్లు
▪️RTGSకు రూ.101 కోట్లు
▪️ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు రూ.27,518 కోట్లు
▪️అన్నదాత సుఖీభవకు రూ.6,300 కోట్లు
▪️పోలవరం కోసం రూ.6,705 కోట్లు
▪️జల్‌జీవన్ విషన్‌కు రూ.2,800 కోట్లు
▪️వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు
▪️పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు
▪️బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు
▪️ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు
▪️ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు
▪️అల్పసంఖ్యాక వర్గాలకు రూ.5,434 కోట్లు
▪️మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల కోసం రూ.4,332 కోట్లు
▪️వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు
▪️పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు
▪️ఆర్ అండ్ బీకి రూ.8,785 కోట్లు
▪️యువజన, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు
▪️తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు
▪️నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు
▪️డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు
▪️రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.500 కోట్లు
▪️ధరల స్థిరీకరణ నిధికి రూ.300 కోట్లు
▪️ITI, IITల కోసం రూ.210 కోట్లు
▪️దీన్‌దయాళ్ అంత్యోదయ యోజనకు రూ.745 కోట్లు
▪️రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు రూ.10కోట్లు
▪️ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి రూ.62 కోట్లు
▪️ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ. 11,314 కోట్లు
▪️మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు
▪️ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు.
రాజధాని ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడిందన్నారు. అన్ని రంగాలు మళ్లీ బలం పుంజుకుంటున్నాయని చెప్పారు. సేవల రంగంలో 11.7 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు.
పెన్షన్లను రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, దీపం పథకం ద్వారా అర్హులకు 3 ఉచిత సిలిండర్లు, 204 అన్న క్యాంటీన్లను ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు, రూ.25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు.
AP Budget 2025-26 Highlights
Sl. No | Title & Description | Volume | Download Link |
---|---|---|---|
01 | Annual Financial Statement & Explanatory Memorandum on Budget 2025-26 | Vol-I/1 | Click Here |
02 | Statement of Demands for Grants 2025-26 | Vol-I/2 | Click Here |
03 | Detailed Estimates of Revenue & Receipts | Vol-II | Click Here |
04 | Legislature | Vol-III/1 | Click Here |
05 | General Administration, Youth Advancement, Tourism & Culture Department, Information Technology & Communications & Public Enterprises Department | Vol-III/2 | Click Here |
06 | Law Department & Home Department | Vol-III/3 | Click Here |
07 | Revenue Department | Vol-III/4 | Click Here |
08 | Finance Department & Planning Department | Vol-III/5 | Click Here |
09 | Transport, Roads & Buildings Department | Vol-III/6 | Click Here |
10 | Education Department | Vol-III/7 | Click Here |
11 | Health, Medical & Family Welfare Department | Vol-III/8 | Click Here |
12 | Municipal Administration & Urban Development Department | Vol-III/9 | Click Here |
13 | Labour, Employment, Training & Factories Department & Department for Women, Children, Disabled & Senior Citizens | Vol-III/10 | Click Here |
14 | Agriculture & Co-Operation & Food, Civil Supplies & Consumers Affairs Department | Vol-III/11 | Click Here |
15 | Housing Department, Social Welfare Department, Backward Classes Welfare Department & Minority Department | Vol-III/12 | Click Here |
16 | Water Resources Department | Vol-III/13 | Click Here |
17 | Panchayat Raj & Rural Development Department | Vol-III/14 | Click Here |
18 | Environment, Forests, Science and Technology Department & Energy, Infrastructure and Investment Department | Vol-III/15 | Click Here |
19 | Industries & Commerce Department | Vol-III/16 | Click Here |
20 | Animal Husbandry, Dairy Development & Fisheries Department | Vol-III/17 | Click Here |
21 | Public Account | Vol-IV | Click Here |
22 | Annexures to Budget for 2025-26 (Telugu) | Vol-V/1 | Click Here |
23 | Annexures to Budget for 2025-26 (English) | Vol-V/2 | Click Here |
24 | Andhra Pradesh Budget in Brief 2025-26 | Vol-VI | Click Here |
25 | Outcome Budget 2025-26 | Vol-VII/1 | Click Here |
26 | Scheduled Tribes Component (Earlier Tribal Sub-Plan) | Vol-VII/2 | Click Here |
27 | Scheduled Castes Component (Earlier Scheduled Castes Sub-Plan) | Vol-VII/3 | Click Here |
28 | Appendix – A to the Budget Estimates 2025-26 | Vol-VIII/1 | Click Here |
29 | Appendix – B to the Budget Estimates 2025-26 | Vol-VIII/2 | Click Here |
30 | Analysis of the Demands for Grants 2025-26 by Ministers | Vol-IX | Click Here |
31 | Child Budget – Department Wise Budget Allocation For The Year 2025-26 | – | Click Here |
32 | Gender Budget – Department Wise Budget Allocation For The Year 2025-26 | – | Click Here |
33 | Budget Allocations To Backward Classes For The Year 2025-26 | – | Click Here |
34 | Budget Allocations To Minorities For The Year 2025-26 | – | Click Here |